Warangal Floods 2025 : మొంథా తుపాను ప్రభావంతో వరంగల్ నగరం జలప్రళయంలో చిక్కుకుంది. హంటర్ రోడ్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగి ప్రజలు ఇళ్లలోనే ఇరుక్కుపోయారు. రోడ్లు నదుల్లా మారి రవాణా వ్యవస్థ స్తంభించింది. NDRF బృందాలు రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయి.వర్షాల దృష్ట్యా వరంగల్ బల్దియా కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 1980 ఏర్పాటు చేశారు. డీఆర్‌ఎఫ్, ఇంజినీరింగ్, శానిటరీ సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను నియమించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పాఠశాలల్లో ఎస్‌ఏ-1 పరీక్షలు కూడా వాయిదా వేసినట్లు వరంగల్ డీఈవో వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో భారీ వర్షం కురిసింది. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో సుమారు 2 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నీట మునిగింది. రైల్వే ట్రాక్‌పై 3 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించగా, జేసీబీల సాయంతో అధికారులు 12 గంటలు శ్రమించి నీటిని తొలగించారు. సీఎం రేవంత్ సహాయక చర్యల పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. <br /> <br />Cyclone Montha has brought unprecedented rainfall to Warangal city, submerging roads, homes, and localities. The NDRF teams are in action conducting rescue operations as the city struggles under floodwaters. Watch exclusive visuals and latest updates from the ground. <br /> <br />#WarangalFloods2025 #CycloneMontha #WarangalUnderWater #TelanganaFloods #WarangalNews #MonthaEffect #NDRFRescue #TelanganaRains #WarangalToday #WarangalUpdates #WarangalRainNews #TelanganaNews #MonthaCyclone #WarangalCity
